29-08-2025 02:28:00 AM
ఫార్మసీ కాలేజీని ఆదేశించిన హెచ్‌ఆర్‌సీ
2న కమిషన్ ముందు కళాశాల చైర్మన్,ప్రిన్సిపాల్ హాజరుకావాలి
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాం తి): ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాల్సి ఉందని కారణంతో విద్యా ర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలిపివేయడంపై తెలంగాణ మానవ హక్కుల సంఘం స్పందించింది. నల్గొండలోని వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ విద్యాసంస్థకు చెందిన తొమ్మిది మంది బి.ఫార్మసీ విద్యార్థులు దాఖలు చేసిన ఫిర్యాదుపై కమిషన్ గురువారం విచారణ చేప ట్టింది.
ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు అక్రమంగా నిలిపివేయడం మానవ హక్కులను ఉల్లంఘనవుతుందని పేర్కొంటూ, విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్‌ను సెప్టెంబర్ 2న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.