12-06-2025 01:40:54 AM
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమి నరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా మే 25న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మెయి న్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది.
ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్ మార్కులు, కీను మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్టు పేర్కొం ది. అలాగే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సైతం యూపీ ఎస్సీ విడుదల చేసింది. అయితే ఐఎఫ్‌ఎస్ (మెయిన్) పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను వేరేగా విడుదల చేసింది.