31-10-2025 09:51:28 PM
 
							బాన్సువాడ,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సంగోజిపేట, హనుమాజీపేట్, కోనాపూర్ తదితర గ్రామాలలో శుక్రవారం ఆరబెట్టిన వరి పంటను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్నీ పరిశీలించి పూర్తిగా తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఎండిన వడ్లను త్వరగా రైస్ మిల్లులకు తరలించాలని సొసైటీ సిబ్బందికి ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.