31-10-2025 09:54:09 PM
 
							భద్రాచలం,(విజయక్రాంతి): పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా భద్రాచలం పట్టణంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేవు.
పోలీసుల సేవలను స్మరించుకుంటూ రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివ నాయక్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వీరితో పాటు సిఆర్పిఎఫ్ బెటాలియన్ జవాన్లు, పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ సభ్యులు, వికలాంగులు, బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఉత్సాహంగా రక్తదానంలో పాల్గొన్నారు.