31-10-2025 09:48:55 PM
 
							అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, పట్టణ సీఐ శివశంకర్
కోదాడ: జాతీయ సమైక్యతకు పాటుపడిన మహోన్నత వ్యక్తి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సూర్యా పేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ పోలీసుల ఆధ్వర్యం లో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నీ ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత లో జాతీయ భావాలు, దేశ భక్తి నీ పెంపొందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు బలమైన స్ఫూర్తినిచ్చారన్నారు.
ఆయన ఆలోచనలతోనే దేశ సమగ్రత సాధ్యమైందన్నారు. పటేల్ ఇచ్చిన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. యువత పెడదోవ పట్టకుండా ఉన్నత లక్ష్యాలను సాధించి పటేల్ ఆశయాలను సాధించాలన్నారు. కాగా యువకులు, విద్యార్థులు భారీగా ర్యాలీ లో పాల్గొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ అనే నినాదాలతో పట్టణం మారు మోగింది. విద్యార్థులు “జై హింద్”, “వందే మాతరం” నినాదాలతో పటేల్ స్ఫూర్తిని ప్రతిధ్వనింపజేశారు.