calender_icon.png 24 January, 2026 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ శిక్షణ

13-08-2024 01:06:28 AM

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం తెలంగాణలోని ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ తెలిపారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఉంటుందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పబ్లిక్ సర్వీస్ పరీక్షకు సన్నద్ధం అవడానికి మెంటర్ గైడెన్స్‌తోపాటు ఒక ట్యాబ్, ఉచిత భోజన వసతి పొందేందుకు అర్హులైన గిరిజన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.