13-08-2024 01:07:43 AM
ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఈనెల 16న ఉపరాష్ట్ర పతి జగ్‌దీప్ ధన్ఖడ్ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పా ట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 17న ఉదయం ఉపరాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యే వరకు ఆయా విభాగాల అధికారులు ఏర్పా ట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, జీఏ డీ కార్యదర్శి రఘునందన్‌రావు ఇత ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.