27-08-2025 01:01:05 AM
నూతనకల్ ఆగస్టు 26 : విద్యార్థులకు ప్రయోగాత్మకంగా విద్యను బోధించేందుకు టీచింగ్ లెర్నింగ్ మెటిరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని మండల విద్యాధికారి రాములు నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయలకు టీచింగ్ లెర్నింగ్ మెటిరియల్ మేళాను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్దతో విద్యను అందించాలన్నారు. సమ్మేళనంలోని ప్రతి విషయాన్ని విద్యార్థుల తరగతి స్థాయిని బట్టి బోదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నాగరాజు, డిప్యూటి తహసీల్దార్ వంశీరాజ్, ఎంఎన్‌ఓ శివయ్య, ప్రధానోపాధ్యాయులు వివి నాయక్, రాంమ్మోహన్, విద్యాసాగర్, ఉప్పు నాగయ్య, సృజన్ కుమార్, ఇంద్రారెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాసరావు, ఉపేందర్, నీరజ, సోమయ్య, మురళి, మాధవి, శ్రీదేవి ఆర్ పిలు, సిఆర్ పిలు తదితరులు పాల్గొన్నారు.