calender_icon.png 27 August, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

27-08-2025 01:00:00 AM

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.  ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి, ఆగస్టు 26 :  విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కల్పిస్తూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు  అం దించాలని ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభు త్వ ఆసుపత్రిలో ఎంపీ నిధులతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను  ప్రారం భించిన అనంతరం వారు మాట్లాడారు.

గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు  అవసర నిమిత్తం వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు.  ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత నివ్వడంలో భాగంగానే ఇంటిగ్రేడ్ పాఠశాలను రూ.200 కోట్లతో తిరుమలగిరిలో ఏర్పాటు చేస్తుందన్నారు. 

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి  సూపరింటీండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, డాక్టర్లు వీణ, రాజు, సింగం సువర్ణ, తహసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్, డి ఎచ్ వెంకటేశ్వర్లు, పిసిసి సభ్యులు గుడిపాటి నరసయ్య, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, మహిళా కమిటీ జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, మండల అధ్యక్షు రాలు, సత్తమ్మ, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శాలిగౌరారం ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రికి కృషి

శాలిగౌరారం, ఆగస్టు 26 : ప్రజా ఆరోగ్య మే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్యేయమని, తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని,అందులో భాగంగా శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తామని ఎం పి చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 3 లక్షల వ్యయం తో ఏర్పాటు చేసిన ప్యూరీ ఫైడ్ వాటర్ ఫ్లాంట్ ను ఎమ్మెల్యే సామేల్ తో కలిసి ఎం ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు.

ఈ సందర్బంగా ఎంపి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లా డుతూ తన నియోజకవర్గ పరిధిలో  రోగు లు అధికంగా చికిత్సలు పొందే పి హెచ్ సీ లను అప్ గ్రేడ్ కోసం, మిగితా పి హెచ్ సీ లలో మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేస్తానన్నారు.  ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ నియోజకవర్గం లోనే శాలిగౌరారం పెద్ద మండలమని ఈ ప్రాం తాన్ని ఎం పి చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. శాలిగౌరారం మార్కెట్‌లో సబ్ స్టేషన్  పక్కన రోడ్డు మీద ఉన్న డబ్బా షాప్ లను వెంటనే తొలగించాలని తహసీల్దార్ జహీరుద్దీన్ ను ఆదేశించారు.

ప్రతీ మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు.  నల్లగొండ డిప్యూటీ డిఎం హెచ్‌ఓ వేణు గోపాల్ రెడ్డి, మండల వైద్యాధికారిణి సూర్య శిల్ప, శ్వేత, వెంకటేశ్, స్పెషల్ ఆఫీసర్  శ్రీనివాస్,ఎంపీడీవో జ్యోతి లక్ష్మి,మండల పార్టీ అధ్యక్షులు సమరం రెడ్డి,అన్నె బోయిన సుధాకర్ పౌష్టికాహార దాతలు వడ్లకొండ పరమేష్ పవిత్ర దంప తులు, లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మెన్ బుడిగె శ్రీనివాసులు, క్లబ్ కార్యదర్షి దామెర్ల శ్రీనివాస్, కోశాధికారి గుండు పరమేష్, చామల మహేందర్ రెడ్డి, రామడుగు వెంక ట్రామ శర్మ, దునక వెంకన్న,నిమ్మల వీర స్వామి, బండారు శంకర్,గండూరి విజయ లక్ష్మి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.