27-08-2025 12:58:56 AM
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 26 (విజయక్రాంతి): గతంలో తమ ప్రజాప్రభుత్వం చెప్పి నట్టే సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని కల్పిస్తుందని చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిరిసిల్లలో ట్రిప్ట్ పథకం ద్వారా నేత కార్మికులకు మంగళవారం రూ.24.60 కోట్ల విలువజేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సమస్యలు తెలుసన్నారు. గత ప్రభుత్వం వివిధ రకాలుగా బకాయి పెట్టిన సుమారు రూ. 1000 కోట్లను దశలవారీగా విడుదల చేసిందని చెప్పారు.
బ్యాక్ బిల్లింగ్ తోపాటు వస్త్ర పరిశ్రమలు నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సు ముఖంగా ఉందని వెల్లడించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసి ల్ల వేములవాడ పారిశ్రామిక, ఆధ్యాత్మిక రం గాలపై దృష్టి పెట్టి అభివృద్ధి కోసం కృషి చే స్తుందన్నారు.
ప్రభుత్వ చేనేత జౌలి శాఖ ప్రి న్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలలో పూర్తయ్యేలా ట్రిఫ్ట్ పథకాన్ని అందించినట్లు తెలిపారు. అంతకుముందు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి దంపతుల విగ్రహాలను ఆవిష్కరించా రు. కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ గీతే, కేకే మహేందర్‌రెడ్డి, నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూప పాల్గొన్నారు.