19-09-2025 01:05:40 AM
హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో నిజం లేదన్న సెబీ
ముంబై, సెప్టెంబర్ 18: గౌతమ్ అదానీ సంస్థలపై అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) గురువారం క్లీన్ చీట్ ఇచ్చింది. అదా నీ కంపెనీలు స్టాక్ అవకతవకలు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతున్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలతో భారీగా పతనం అయిన అదానీ గ్రూప్ షేర్లు తర్వాత నెమ్మదిగా కోలుకున్నాయి.
తాజాగా సెబీ క్లీన్ చిట్ ఇవ్వడంతో అదానీ కంపెనీలకు భారీ ఊరట లభించింది. సెబీ క్లీన్‌చిట్ ఇవ్వడంపై అదానీ ఎక్స్ వేదికగా స్పందించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలు అవాస్తవమని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, తప్పుడు వాదనలు ప్రచారం చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.