19-09-2025 12:25:59 AM
నగరంపై వరుణ ప్రళయం
రెండు గంటల్లోనే అతలాకుతలం
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బుధవారం రాత్రి కురిసిన వర్షం నుంచి తేరుకోకముందే గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. కేవలం రెండు గంటల వ్యవధిలో కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. ఎక్కడికక్క డ వాహనాలు నిలిచిపోయి నగరవాసులు నరకం చూశారు.
అత్యధికంగా బహదూర్‌పురాలో 8.65 సెం.మీ. వర్షపాతం నమోదైం ది. నగరంలోని ప్రధాన రహదారులైన పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, నాం పల్లి సహా పలు ప్రాంతాల్లో మోకాళ్ల నుంచి నడుం లోతు వరకు నీరు చేరింది. ఫ్లుఓవర్ల పైన కూడా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కార్యాల యాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో వర్షం కురవడంతో వేలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అనేక అపార్ట్‌మెం ట్ల సెల్లార్లలోకి నీరు చేరడంతో వాహనా లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని వం దలాది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజ లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు రానున్న మూడు రోజుల్లో మోస్తరు వానలు
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సూర్యాపేట, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శని, ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పలు జిల్లాలలో కురుస్తాయని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.