calender_icon.png 19 September, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో విద్యావ్యవస్థను పటిష్ఠం చేయాలి

19-09-2025 01:17:15 AM

  1. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి
  2. సమీక్షలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అధికారులు సమాయత్తం కావాలని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ సంక్షే మ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. గురవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు తక్షణం కొత్త భవనాల నిర్మాణం, అలాగే పాత భవనాలకు మేజర్, మైనర్ మరమ్మతులు చేపట్టాల న్నారు. రాష్ర్ట ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అధికారులం తా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల చదువులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ నిధుల విషయంలో చురుకుగా అనుసంధానం చేయా లని సూచించారు. డ్రాపౌట్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మెంటర్‌షిప్, కౌన్సెలింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థుల స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీ యాక్సెస్‌పై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూ చించారు. ఉన్నత విద్య, జాతీయ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పా టు చేయాలని చెప్పారు.

దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరైన విధానాలను అమలు చేయాలని ఆదేశించారు. సంక్షేమ కార్పొరేషన్లు అమలు చేస్తున్న పథకాలు పేద ప్రజ లకు సులభంగా చేరేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సాంకేతిక తను వినియోగించి పారదర్శకతను పెంచాలని సూచించారు.

సమావేశంలో సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్, మహి ళ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అనితా రామచంద్రన్, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ క్షితిజ, మైనా ర్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ, ఎస్సీ గురుకుల కార్యదర్శి కృష్ణా ఆదిత్య, గిరిజన గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, దివ్యాం గుల శాఖ డైరెక్టర్ శైలజ, మైనార్టీ గురుకుల కార్యదర్శి షఫియుల్లా పాల్గొన్నారు.