calender_icon.png 19 September, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో జోరుగా పంచాయతీ ఎన్నికల ముచ్చట్లు

19-09-2025 12:00:00 AM

  1. బరిలో తాజా, మాజీ సర్పంచ్ అభ్యర్థులు..
  2. పోటీలో లేమంటూనేలో లోపల ఎత్తుగడలు
  3. ఎంత ఖర్చయినా సరే.. గెలవాల్సిందే..
  4. గ్రామాలల్లో మొదలైన సరికొత్త రాజకీయాలు

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కాకముందే వనపర్తి, గద్వాల జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రామాల్లో ఏ నలుగురు కలిసినా పంచాయతీ ముచ్చట్లే. బరిలో నిలిచే దెవరు.. గెలిచేదెవురు అనే చర్చ జరుగుతుంది.

అభ్యర్థులు ఎంతైన సరే తగ్గేదేలే అన్న తరహాలో ఖర్చు పెట్టేందుకు సైతం సిద్ధమవుతు న్నారు. తమ వర్గం వాళ్లు ఎవరు? పక్క వ ర్గం వాళ్ళు ఎవరు అనే అంశాలను చర్చించుకుంటున్నారు. ఎంత ఖర్చయినా సరే ఈ సారి బరిలో నిలవాల్సిందేనని తాజా మాజీ సర్పంచులు, గతంలో ఓడిన వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

వనపర్తి, సెప్టెంబర్ 18 ( విజయక్రాంతి ) :సర్పంచ్ గా చేసి మొత్తం అప్పుల పాలయ్య ము..ఈ సారి నిలబడేది లేదు అని తాజా మాజీ సర్పంచ్ లు, పోయిన సారి పోటీ చేసినప్పుడు చాలా ఖర్చు పెట్టిన లాస్ అయ్యాను. మళ్ళీ ఇంకోసారా అని గతంలో పోటీ చేసి ఓడిపోయాన వాళ్లు హే మనకు ఎందుకు సర్పంచ్ గిరి అంటూ గ్రామాల్లో పలుకుబడి వున్న నాయకులు. మేము ఎం బరిలో ఉండం అని గ్రామంలోని నాయకు లు ఇలా ఎవరికి వారు బరిలో లేము అం టూనే తమ శైలిలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. వనపర్తి, గద్వాల జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాజాగా జరిగిన వినాయక చవితి పండగ, రేపు జరుగబోయే దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో చాలా గ్రామాల్లో ఆ శావహులు గట్టిగానే చందాలను సమర్పించుకున్నారు. గ్రామాల్లో పండగలకు చందా లు, ఎవరు అయిన చనిపోతే ఆర్థిక సహా యం అందించడం, బియ్యం, ఇతర వస్తువులు అందించడం లాంటి కార్యక్రమాలను పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. తమ వర్గం వాళ్లు ఎవరు? పక్క వర్గం వాళ్ళు ఎవరు అ నే అంశాలను చర్చించుకుంటున్నారు. కులాల వారీగా ఓట్లను తమ వైపునకు ఎలా మల్చు కోవాలనే విషయాలలో మల్ల గుల్లలు పడుతున్నారు.

గ్రామ పరిస్థితులకు అనుకూలంగా ఖర్చు లు పెట్టేలా ప్రణాళికలు

కొంతమంది అభ్యర్థులు తమ గ్రామంలో పరిస్థితులకు అనుకూలంగా తమ గెలుపుకోసం అధికంగా డబ్బు ఖర్చు చేసే ఆలో చనలు ఉన్నారు. ప్రచారం, విభిన్న వాగ్దానాలు, నడుమ సహాయం ప్రకటిస్తూ తమ ను అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర యత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ సారి జా గ్రత్తగా ఖర్చు చేసే ఆలోచనలో వున్నారు.

ఆర్థిక పరంగా బలమైన అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో మరింత ఖర్చు చేయను న్నట్లు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. ప్రతి ఊరులో ఇదే ప్రధాన చర్చగా మారింది. గ్రామాల్లో రాజకీయ చురుకుదనం పెరిగింది. పదవీకాలం ముగిసిన తర్వాత, కొన్ని గ్రామాల్లో విశ్రాంతి పొందిన సర్పంచ్లు కూడా మళ్లీ బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రతి గ్రామంలో ప్రజలు తన అభ్యర్థి ని ఎంచుకోవాలనే ఆసక్తితో చర్చిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రధాన నేతలు, స్థానిక నా యకులు ప్రజల్లో మంచి పేరు సంపాదించేందుకు వ్యూహాత్మకంగా ముందు కెళ్తున్నారు.

వనపర్తి జిల్లా వివరాలు ....

జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉండగా, 268 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 133 ఎంపిటిసి, 15 జెడ్పి టీసి, 2436 వార్డులు ఉన్నాయి. జిల్లా లో మొత్తం 3,82, 295 ఓటర్లు ఉండగా పురుషులు 1,90,068 మంది, స్త్రీలు 1,92,223 మంది 4 ఇతరులు ఉన్నారు.

గద్వాల జిల్లా వివరాలు ....

జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉండగా, 255 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. 142 ఎంపిటిసి, 13 జెడ్పి టీసి, 2990 వార్డులు ఉన్నాయి. 

జిల్లా లో మొత్తం 3,93,418 ఓటర్లు ఉండగా పురుషులు 1,93, 627 మంది, స్త్రీలు 1,99,781 మంది 10 ఇతరులు ఉన్నారు.