calender_icon.png 19 September, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురక్షిత నగరంగా హైదరాబాద్

19-09-2025 01:19:29 AM

  1. చిన్నారుల భద్రతే ప్రభుత్వ లక్ష్యం
  2. ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతాం
  3. మంత్రులు పొన్నం, సీతక్క
  4. సచివాలయంలో క్లాప్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రులు

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లో “క్లాప్ ఫర్ చిల్డ్రన్’ పిల్లల భద్రత కోసం నగర స్థాయి కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ ప్రభు త్వం, యూనిసెఫ్ సంయుక్తంగా ప్రారంభించింది. పిల్లలకు హైదరాబాద్‌ను సురక్షిత నగ రంగా మార్చుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్లాప్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్‌ను సచివాలయంలో గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లా డుతూ... హైదరా బాద్‌ను “పిల్లలకి సురక్షిత నగరం”గా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఇతర నగరాలు, రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామన్నారు. ఈ ప్రయత్నంలో యూనిసెఫ్ సంస్థ కు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ విభాగా లు, చట్టపరమైన సంస్థలు, సమాజం కలిసి పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి కృషి చేయనున్నారు.

చట్టపరమైన సంస్థ లు, ఫ్రంట్‌లైన్ సేవలను బలోపేతం చేసి, మహిళా  సంక్షేమ, పోలీసు, ఆరోగ్యం, విద్య, కార్మిక, జీహెచ్‌ఎంసీ వంటి విభాగాల సమన్వయంతో బుల్లీయింగ్, ఈవ్-టీజింగ్, అసురక్షిత రవాణా, మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించడానికి చర్యలు చేపడ తారు.

బాలల రక్షణ సెల్‌లు, విజిలెన్స్ కమిటీల ద్వారా డేటా ఆధారిత మానిటరింగ్ జరుగుతుంది. అలాగే ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, పిల్లలకు అనుకూలమైన, శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షే మ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, యూనిసెఫ్ చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ డా. జెలాలెం బిరాను టాఫెస్సే పాల్గొన్నారు.