19-09-2025 01:20:48 AM
నవంబర్ 30 తర్వాత అగ్రరాజ్యం నిర్ణయం తీసుకునే అవకాశం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: అమెరికా విధించిన 50 శాతం సుంకాలు నవంబర్ 30 తర్వాత తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాతో వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పరిస్థితులను గమనిస్తే నవంబర్ 30 తర్వాత సుంకాల భారం తగ్గొచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. కోల్‌కతాలో నిర్వహించిన మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమంలో అనంత నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని క్లారిటీనిచ్చారు. అమెరికా విధించిన అదనపు సుంకాలకు రష్యా చమురు కారణం కాదని తాను భావిస్తున్నట్టు తెలిపారు.