calender_icon.png 29 September, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైసల కోసం పర్యావరణ విధ్వంసం..

29-09-2025 12:38:30 AM

దుందుభి వాగును పీల్చి పిప్పి చేస్తున్న ఇసుక మాఫియా

కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 28కల్వకుర్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొ డుతూ, పర్యావరణాన్ని నాశనం చేస్తూ దుం దుభి వాగును అక్రమార్కులు అమాంతం కొల్లగొడుతున్నారు. ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు మామూళ్ల మత్తులో జో గుతున్నారని, జిల్లా యంత్రాంగం ప్రేక్షకపా త్ర వహిస్తోందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

యథేచ్ఛగా అక్రమ దందా.

ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రా మ సమీపంలోని దుందుభి వాగు ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. టీజీఎండీసీ (తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ) నుం చి ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రైవే టు వ్యక్తులు పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారని సమీప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాగులో నీరు ఉన్నా లెక్కచేయకుండా, ఐదు కు పైగా హిటాచీలను ఉపయోగించి ఇసుకను టిప్పర్లలోకి ఎత్తిపోస్తున్నారు. సుల భంగా రవాణా చేసేందుకు నది మధ్యలో ప్రత్యేకంగా దారిని ఏర్పాటు చేసుకుని మరీ ఈ దందాను కొనసాగిస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అధికారుల కనుసన్నల్లోనే దందా. 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సమయంలో బంగారం కంటే విలువైన ఇసుకను అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కా యలుగా వర్ధిల్లడానికి అధికారుల అండదండలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందని, టిప్పర్లు సజావుగా సాగేందుకు వారికి ము డుపులు అందుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు 30 నుంచి 40 టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా, జిల్లా యంత్రాంగం కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీటిపై స్థానికులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. 

కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి. 

ప్రతిరోజు 10, 12, 16 టైర్ల టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పగటిపూట కల్వకుర్తి పరిసర ప్రాంతాలకు, రాత్రి పూట భారీ టిప్పర్లతో హైదరాబాద్కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. స్థాని కంగా టన్ను ఇసుక రూ. 1,600 పలుకుతుండగా, హైదరాబాద్లో రూ. 2,500 వరకు అమ్ముతున్నారు. ఈ లెక్కన రోజుకు లక్షలాది రూపాయలు, నెలకు కోట్లాది రూపా యలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుండగా, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది.

అధికారుల అలసత్వం మాఫియా ఆగడాలకి మార్గం. 

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఇ సుకను మాఫియా తారుమారు చేస్తుండగా, స్థానిక అధికారుల నిశ్శబ్దం అనుమానాస్పదంగా మారింది. చట్టపరమైన చర్యలు చేప ట్టాలనే పట్టుదల కనిపించకపోవడం వల్లే ఈ అక్రమ రవాణా కొనసాగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎవరు పట్టించుకోర న్న ధైర్యమే మాఫియాల బలం అని స్థానికులు విమర్శిస్తున్నారు.

కల్వకుర్తి ,వంగూరు,ఉప్పునూతల మండలాల పరిధిలో ఉన్న దుందుభి వాగు నుంచి నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్ లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాయి. గత నెల రోజు ల క్రితం లింగసానిపల్లి గ్రామస్తులు దాదా పు 12 ఇసుక టిప్పర్ లను పోలీసులకు ప ట్టించినప్పటికీ ఇసుక మాఫియాలో ఎలాం టి మార్పు రాకపోవటం, పట్టుబడిన అక్రమ ఇసుక మాఫియాపై కేసు లకు సంబంధించిన వివరాలు అధికారులు మీడియాకు చెప్పకపోవడం, నిర్విరామంగా రాత్రిళ్లు ఇసుకను రవాణా చేస్తుండడం తో అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి.

ప్రజల గోస, పర్యావరణ విధ్వంసం. 

ఇసుక మాఫియా ఆగడాలతో స్థానిక గ్రా మాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో అధిక లోడ్తో వెళ్తున్న టి ప్పర్ల శబ్దాలకు నిద్దర కరువైందని వాపోతున్నారు. వాహనాల వల్ల రోడ్లు దెబ్బతినడం తో మా వాహనాలతో పాటు ఆరోగ్యం దె బ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, విచక్షణారహితమైన ఇసుక తవ్వకాలతో దుందుభి వాగు స్వరూపం దెబ్బతి ని, భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర పర్యావరణ నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి, పర్యావరణాన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని ప్రజలుకోరుతున్నారు.