18-09-2025 12:14:44 AM
ఇల్లెందు,(విజయక్రాంతి): భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సింగరేణి కంపెనీ యాజమాన్యం ఆదేశానుసారం ఈ సంవత్సరం సెప్టెంబర్ 17వ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టిన ‘స్వచ్ఛత హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇల్లందు ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యకమానికి ముఖ్య అతిధిగా ఇల్లందు ఏరియా జి ఎం వి.కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి.యం మాట్లాడుతూ మహాత్మ గాంధీజీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారో అది ఒక్క స్వాతంత్య రాజకీయ భారతమే కాదు పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారని, ప్రతి సంవత్సరంలో 100 గంటలు, ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుద్ధ తెలంగాణ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను.
అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను అని అన్నారు. “శుభ్రత అనేది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు, ప్రతి రోజు పాటించాల్సిన అలవాటు. పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యం అవుతుంది” అని అన్నారు. స్వచ్ఛత హీ సేవా’ కార్యక్రమంలో బాగంగా మొదటి రోజు ఏరియా ఆసుపత్రి ఆవరణలో ప్లాస్టిక్ రహిత, సమాజ నిర్మాణానికి కృషిచేయాలని ప్రతి ఒక్కరు తమ భాద్యతగా భావించి పని స్థలాలను పరిసరాలను శుభ్రపరచుకోవాలని ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరికి అవగహన కలుగుతుందని అన్నారు అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంటె మనం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. తరువాత ఆసుపత్రి ఆవరణలో ఉన్న పరిసరాలను శుభ్రపరచి చెత్తను ఊడ్చి ఎత్తివేశారు.