18-09-2025 12:18:36 AM
విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 17: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చిరు ధాన్యాలు - ఆహార పదార్థాల విక్రయ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
తృణ ధాన్యాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, ముఖ్యంగా శరీరానికి పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మాంసాహారంతో పోలిస్తే చిరు ధాన్యాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని తెలిపారు. చిరు ధాన్యాలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్‌ఓ సంగీత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉష, సీపీఓ సామ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.