calender_icon.png 5 May, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువగా..

05-05-2025 01:51:23 AM

  1. లక్నోపై విజయకేతనం ఎగురేసిన పంజాబ్
  2. ఉత్కంఠ పోరులో విజయం సాధించిన కేకేఆర్

న్యూఢిల్లీ, మే 4: డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ విజయబావుటా ఎగరేశాయి. ఆదివారం మధ్యాహ్నం పోరులో రాజస్థాన్‌పై కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. అనంతరం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై 37 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది.

టాస్ గెలిచిన లక్నో పంజాబ్‌కు బ్యాటింగ్ అప్పగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు 236 పరుగుల భారీ స్కోరు సాధించారు. 237 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది.

ఆయుష్ బదోని (74), అబ్దుల్ సమ ద్ (45) పోరాటంతో లక్నో ఆ మా త్రం స్కోరైనా చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువయింది. నేడు హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.