24-01-2026 12:00:00 AM
ముఖ్యఅతిథిగా ఎంఈఓ పడిగా నాగయ్య
పినపాక, జనవరి 23, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జాగంపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలను జానంపేట గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం పినపాక మండల విద్యాశాఖ అధికారి కొమరం నాగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పల్లెల నుండి పట్టణ స్థాయి వరకు క్రీడల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ క్రీడలను యువత సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించి మొదటి దశ నుండి అంటే కష్టస్థాయి నుంచి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో రాణించి జిల్లాస్థాయి క్రీడల రాణించాలని అన్నారు.
క్రీడలతో స్నేహభావం పెరగటంతో పాటు, చెడు వ్యసనాలకు దూరంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జానంపేట ప్రజల ఉపాధ్యాయురాలు కె. విజయలక్ష్మి, ఈ బయ్యారం పిడి బి. వీరన్న, జానంపేట వార్డు మెంబర్లు, పొనుగోటి చందర్ రావు, కంబ్బాకు రమేష్, వాసం కుమార్, విజయక్రాంతి రిపోర్టర్ పినపాక అత్తి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దందర నరేష్, గ్రామ పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.