24-01-2026 12:00:00 AM
ఖమ్మం /రఘనాథపాలెం, జనవరి 23 (విజయక్రాంతి): వైరా మండల మరియు పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి అధ్యక్షతన జరిగిన వైరా మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికలపై పార్టీ నాయకులకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్య అతిథులు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ శాసనసభ్యులు బానోత్ చంద్రావతి, నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ పార్టీ ఆపద సమయంలో అండగా ఉన్న వారిని పార్టీ తప్పని సరిగా ఆదుకుంటుందని అన్నారు. పార్టీ మారిన వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదని, బిఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ, ఇలాంటి ఒడిదుడుకులు చూసిన పార్టీ అని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల వ్యూహాలను, ప్రజల సమస్యలను చర్చించి గెలుపు మార్గాల్లో ముందుకు సాగాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మాజీ వార్డు కౌన్సిలర్, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు