calender_icon.png 28 September, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి సీఎం శంకుస్థాపన

28-09-2025 12:57:20 PM

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ముఖ్యమంత్రి రేవంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందకూరు మండలం మీర్ఖాన్‌పేటలో 2.11 ఎకరాల్లో నిర్వహించే ఎఫ్సీడీఏ భవనానికి  రేవంత్ పునాది రాయి వేశారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కలుపుతూ వంద మీటర్ల వెడల్పుతో రావిర్యాల నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ నిర్మాణానకి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రపంచ బ్యాంకు, జపాన్ సంస్థల భాగస్వామ్యంతో 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ప్యూచర్ సిటీ విస్తరించనున్నట్లు సమాచారం. నెట్-జీరో స్మార్ట్ సిటీగా ప్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేలను కలుపుతూ కొత్త ఈస్ట్-వెస్ట్ ట్రంక్ రోడ్డు నిర్మాణం జరుగనుంది.