calender_icon.png 6 May, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం భేటీ

06-05-2025 01:07:57 AM

ఆర్‌ఆర్‌ఆర్ పనులు, రేడియల్ రోడ్ల నిర్మాణంపై విజ్ఞప్తులు

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయ లాబీలో సోమవారం కేంద్ర హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీని మర్యా ద పూర్వకంగా కలిశారు. అనంతరం పలు అంశాలపై భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం హైదరాబాద్- -అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు సత్వరం అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరా రు.

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్), రేడియల్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృ ద్ధి అత్యంత కీలకమైన అంశమని, నిర్మాణానికి కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలో చేపట్టనున్న పనులకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించామని, వాటికి కేంద్రం నుంచి ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలిపేలా చొరవ చూపాలని కోరారు.

ఎన్ హెచ్- 765 హైవేకు సంబంధించి హైదరాబాద్--శ్రీశైలం సెక్షన్ ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-- డిండి- మన్ననూర్, హైదరాబాద్ - మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే, ఓఆర్‌ఆర్- మన్నెగూడ రేడియల్ రోడ్ పనులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. సీఎం వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులున్నారు.