19-11-2025 07:15:19 PM
రసాయన ఎరువులు తగ్గించాలి
ప్రకృతి వ్యవసాయం రైతుకు అండ
జహీరాబాద్: ప్రకృతి వ్యవసాయం చాలా పవిత్రమైనదని దీంతో ప్రాణకోటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. బుధవారం నాడు జహీరాబాద్ లోని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో కిసాన్ సమ్మాన్ 21 విడత రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు వాడడం వల్ల పంటలపై దుష్ప్రభావం చూపించడంతో పాటు వాటిని సేవించిన వారు కూడా అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రాంతంలో అధికంగా రసాయన ఎరువులు వాడి పంటలు పండించడం వల్ల జీవకోటిపై దుష్ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. రైతులు రసాయన ఎరువులు ఏమి సంహారక మందులను తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయంలో కృషి, షకీలా సేవలు రైతులు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఏ డి ఏ ఓ శ్రీదేవి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవగాహన కల్పించడమే కాకుండా సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని ఆమె పేర్కొన్నారు. నాబార్డ్ డిడిఎం కృష్ణ తేజ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పశుపోషణ ద్వారా పశువులు ద్వారా వచ్చే ఎరువులను పంటలకు వేసి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు నాబార్డు సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల చెందిన వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు.