calender_icon.png 19 November, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

19-11-2025 07:17:51 PM

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్..

చందుర్తి/ కోనరావుపేట మండలాల్లో కొనుగోలు కేంద్రాల పరిశీలన

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): రైతులు తాము కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సూచించారు. చందుర్తి మండలం మర్రిగడ్డ, కట్టలింగంపేట, లింగంపేట, సనుగుల, కోనరావుపేట మండలంలోని అజ్మీరా తండా, భూక్యా రెడ్డి తండా, గొల్లపల్లి, గోవిందరావుపేట తండా, జై సేవాలాల్ తండాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 గా నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.