19-11-2025 07:12:05 PM
హైదరాబాద్: సాలార్ జంగ్ మ్యూజియం శ్రుస్తి ఫౌండేషన్‌తో కలిసి హైదరాబాద్ ఆర్కిటెక్చరల్ హెరిటేజ్‌పై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. ప్రొఫెసర్ సయ్యద్ అయూబ్ అలీ, మొహమ్మద్ గైసుద్దీన్ అక్బర్, ఎస్. రమేష్ కుమార్‌తో కలిసి మీర్ ఫిరసత్ అలీ బక్రీ ప్రారంభించారు. మేనేజింగ్ ట్రస్టీ, శ్రుస్తి ఫౌండేషన్, మీర్ ఫిరసత్ అలీ బక్రీ, తెలంగాణ బిజెపి మాజీ రాష్ట్ర ప్రతినిధి ఈ వారోత్సవాలకు హాజరయ్యారు. ఈ వారోత్సవాలు హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం గ్రౌండ్ ఫ్లోర్, తూర్పు బ్లాక్ లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన నవంబర్ 25 వరకు కొనసాగుతుంది. శుక్రవారం, ప్రభుత్వ సెలవు దినాలు మినహా ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.