23-09-2025 12:56:57 AM
టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
కొండాపూర్, సెప్టెంబర్ 22 : సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదనిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు ఆధ్వర్యంలో సోమవారం కొండాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.11.74 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న.
నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, గొల్లపల్లి సొసైటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసీ నర్సింహా రెడ్డి, మాజీ సర్పంచ్ లు వెంకటేశం గౌడ్, నర్సింలు, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.