23-09-2025 12:55:25 AM
ముఖ్యఅతిథిగా పాల్గొన్న చంద్రారెడ్డి దుర్గామాతకు ప్రత్యేక పూజలు
జిన్నారం, సెప్టెంబర్ 22 : బొల్లారం మున్సిపల్ పరిధిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు సోమవారం కలశ యాత్రను నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కలశ యాత్రను ప్రారంభించారు. ఉత్తరాదికి చెందిన మహిళలు కలశాలను తలపై ధరించి వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి చంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరాది ప్రజల ఆచార సాంప్రదాయాలను ప్రతి ఏటా కొనసాగిస్తూ సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తున్నట్లు తెలిపారు. శక్తి స్వరూపిణి దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
కలశ యాత్రలో పాల్గొన్న మహిళలకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గోపాలమ్మ, దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులు దీననాధ్, రాజారామ్, శ్రీమన్నారాయణ, జె.జె సింగ్ , విజయ్, కార్మిక నాయకులు లఖన్ , ఉద్యానంద్, తివారి , హరేరామ్ యాదవ్, మా అంబి మహిళా సేవా సమితి సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.