calender_icon.png 6 May, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయ నిధి.. పేదల పెన్నిది

06-05-2025 01:08:58 AM

మునుగోడు, మే 5 (విజయక్రాంతి): సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులుఅన్నారు. మండల కేంద్రా నికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు అయినా చెక్కులను ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యా లయంలో సోమవారం అందజేసి మా ట్లాడారు.

వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అంది స్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ప్రభుత్వం బడుగు, బలహీ న వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ము ఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పే ర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్ల లింగస్వామి, యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు పాల్వాయి జితేందర్ రెడ్డి,మాజీ సర్పంచులు మిర్యాల వెంకన్న,పందుల నరసింహ,మాజీ ఎంపీటీసీలు పందుల భాస్కర్,జిట్టగోని యాదయ్య, ఎండి అన్వర్, సింగం గిరి, పందుల నరసింహ, ఆరేళ్ల సైదులు,జిట్టగోని సైదులు,దుబ్బ రవి, దుబ్బ ప్రభాకర్,ఈద పవన్,ఉడుత సత్యనారాయణ ఉన్నారు.