calender_icon.png 6 May, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి పైలెట్ ప్రాజెక్టు మండలంలో గ్రామ సదస్సులు షురూ..

06-05-2025 01:10:33 AM

పర్యవేక్షించిన కలెక్టర్ 

మహబూబాబాద్, మే 5 (విజయ క్రాంతి): భూభారతి చట్టం అమలులో భాగంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ మండలంలోని పెద్ద ముప్పారం ఆగాపేట, రాజవరం, మేఘ్యా తండా, దుబ్బ తండ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆయా గ్రామాలను సందర్శించి గ్రామసభల్లో ప్రజల నుంచి భూ సమస్యలపై స్వీకరిస్తున్న దరఖాస్తుల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భూభారతి చట్టం అమల్లో భాగంగా 28 జిల్లాల్లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ దంతాలపల్లి తహసిల్దార్ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.