calender_icon.png 21 September, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ

20-09-2025 11:14:45 PM

చిగురుమామిడి,(విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ఓపెన్ జిమ్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. చిగురుమామిడి మండలం ఓగులాపూర్లో రూ.5లక్షలతో చేపట్టనున్న ఓపెన్ జిమ్ నిర్మాణానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రూ.5 లక్షలతో ఓపెన్ జిమ్ ను మంజూరు చేశారని అన్నారు.