calender_icon.png 21 September, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబ సన్నిధిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

20-09-2025 11:10:14 PM

అలంపూర్: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎన్.వి శ్రావణ్ కుమార్ దంపతులు శనివారం దర్శించుకున్నట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు.వీరికి ముందుగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చనలు, బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు వంటి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం అర్చకులు వారిని శేష వస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు.వీరి వెంట గద్వాల జిల్లా జడ్జి ప్రేమలత, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి మిథున్ తేజ ఉన్నారు.