23-04-2025 04:51:11 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): నాంపల్లి ప్రజాప్రతినిధుల(Nampally People's Representatives Court) ప్రత్యేక కోర్టులో తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ వేశారు. గతేడాది భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఆధారంగా బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలు చేశారని, బీజేపీ పార్టీకి నష్టం కలిగేలా ఆయన మాట్లాడారంటూ ఆరోపిస్తూ కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.
ఈ పిటిషన్ పై ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టిందని, ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు ప్రసంగం ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సాక్ష్యంగా సమర్పించారు. దీంతో ప్రజాప్రతినిధుల కోర్టులో విచరణలో ఉన్న ఈ కేసులో అర్హత లేదని వాదిస్తూ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణను రద్దు చేయాలని, తప్పనిసరి కోర్టు హాజరు నుండి తనను మినహాయించాలని కోరారు. కేసును విచారణ చేపట్టవద్దని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం హైకోర్టు పరిశీలించనుంది.