calender_icon.png 27 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు పంటలకు లాభసాటి ధర చెల్లించాలి

27-12-2025 12:38:25 AM

 కిసాన్ జాగరణ్ అధ్యక్షులు పి సుగుణాకర్ రావు 

కరీంనగర్, డిసెంబరు 26 (విజయ క్రాంతి): రైతు పంటలకు లాభసాటి ధర రాని కారణంగా చాలామంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తుల్లో జీవనోపాధి పొందుతున్నారని, పంటలకు లాభసాటి ధర చెల్లించాలని కిసాన్ జాగరణ్ అధ్యక్షులు పి సుగుణాకర్ రావు అన్నారు. నిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మేళాలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఇప్పటికీ వ్యవసాయం ఆధారంగా దాదాపు 70 శాతం మంది ప్రజలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, 50 శాతానికి పైగా జనాభాకు ప్రత్యేక ఉపాధి కల్పిస్తున్నారని, ఇలాంటి ప్రాముఖ్యత గల రంగాన్ని విస్మరించడం దురదృష్టకరమన్నారు.

దేశంలోనే 70 శాతం మంది ప్రజల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాలు పెరగనిదే వికసిత్ భారత్ సాధ్యం కాదని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారకరమని తెలిపారు ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం రైతు పంటకు లాభసాటి ధర దక్కేందుకు దానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ బి.ఎన్ రావు, రైతు నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, నరసింహనాయుడు, మల్లారెడ్డి, నేలమడుగు శంకరయ్య, ఎఫ్‌ఈఓ అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.