calender_icon.png 27 December, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ పోటీలతో వెలుగులోకి క్రీడాకారులు

27-12-2025 12:40:32 AM

  1. హుస్నాబాద్ లో క్రికెట్ స్టేడియానికి 20 ఎకరాల స్థలం

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, డిసెంబరు 26 (విజయ క్రాంతి): కాకా వెంకట్ స్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లాల టి20 క్రికెట్ పోటీల నిర్వహణతో ప్రతిపగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని అలుగునూరులో నిర్మించిన వెంకట్ స్వామి మెమోరియల్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల టి20 క్రికెట్ పోటీలలో భాగంగా కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల జట్ల మధ్య టి20 లీగ్ మ్యాచ్ ను మరో మంత్రి వివేక్ వెంకట్ స్వామితో కలిసి రంగురంగుల బెలూన్లు ఎగురవేసి జట్ల మధ్య టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ ఉప్పల్లో వివేక్ వెంకటస్వామి క్రికెట్ స్టేడియానికి అంకురార్పణ చేశారన్నారు. రాష్ట్రం నుంచి హర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్, అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేశారన్నారు. ప్రస్తుతం భారత జట్టు లో సిరాజ్, తిలక్ వర్మ లాంటివారు మన రాష్ట్రం నుంచి వహిస్తున్నారు అన్నారు.

జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ చాటి జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పోరట్స్ పాలసీ తీసుకువచ్చి క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తుంది అన్నారు.. హుస్నాబాద్ లో 20 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అక్కడ అద్భుతమైన స్టేడియాన్ని నియమించాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.