15-07-2025 10:08:30 PM
సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తి గత విమర్శలు చేయడం సిగ్గుచేటు
తెలంగాణ బాపూజీ కెసీఆర్ పోరాట ఫలితమే నీకు సీఎం అయ్యే చాన్స్ రాలేదా..!
జగదీశ్ రెడ్డి తులసి మొక్కతో సమానం
పెన్ పహాడ్ విలేకర్ల సమావేశంలో విమర్శలు గుప్పించిన గులాబీ శ్రేణులు
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (తిరుమలగిరి) సభలో సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు మంగళవారం పెన్ పహాడ్ మండల కేంద్రములోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ నేతలు ఘాటైన కౌంటర్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేయడానికే స్థానిక ఎలక్షన్ స్టంట్ పేరుతో రేషన్ కార్డుల పంపిణి అధికారిక కార్యక్రమముగా నిర్వహించాల్సింది పోయి.. కాంగ్రెస్ బహిరంగ సభగా దర్శనం ఇచ్చిందని మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేంధర్ హేద్దేవా చేశారు.
మాజీమంత్రి జగదీశ్ రెడ్డి పై.. ముఖ్యమంత్రి హోదాను మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని నిజాలు.. చేస్తున్న మోసాలన్నీ ప్రజలకు తెలుసునని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీల జాడ లేదని రేషన్ కార్డుల పంపిణీతో బహిరంగ సభను ఏర్పాటు చేయడం వెనుక స్థానిక ఎన్నికలలో మొఖం చాటుకోలేకనే ఈసభను పెట్టడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి ఎన్ని సభలు పెట్టినా ప్రజలను మోసం చేయలేరన్నారు. తమ బీఆర్ఎస్ పాలనలో సుమారు 7 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినా తాము ఎన్నడూ ఇలాంటి ప్రచారాలు చేసుకోలేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలు బీడు భూములు.. సాగు భూములు అయ్యాయని, అంతేకాదు రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ లాంటి పథకాలతో రైతులు గుండెల్లో స్థిరస్థాయిగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని ఎత్తుగడలు వేసినా బోర్ల..ఎల్లెల్లకలా పడ్డా కాంగ్రెస్ గల్లాస్ కాక తప్పదని బీఆర్ఎస్ నాయకులు విరుచక పడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల ముసుగులో తప్ప.. పనులు చేయడం చేతకాదన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మాటలలో మార్పు తెచ్చుకోక పోతే ప్రజలే తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గరల్లో ఉన్నాయన్నారు.