calender_icon.png 16 July, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైద్య కళాశాలలో అధ్యాపక ఉద్యోగాలకు 17న ఇంటర్వ్యూ

15-07-2025 10:11:29 PM

మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు ఈ నెల 17 (గురువారం)న కళాశాల ఆవరణలో జరగనున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్ధులకు ప్రొఫెసర్ 1,90,000, అసోసియేట్ ప్రొఫెసర్ రూ 1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ 1,25,000, సీనియర్ రెసిడెంట్ కు రూ 1,06461 జీతం చెల్లించబడుతుందని అన్నారు. అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు పూర్తి వివరాలు, దరఖాస్తు ఫారం కొరకు http://kothagudem.telangana.gov.in  వెబ్‌సైట్ ను సందర్శించాలన్నారు.