11-12-2025 01:52:10 AM
నేడు సోనియా, ఖర్గే, రాహుల్‌తో పాటు కేంద్రమంత్రులను కలిసే అవకాశం
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. గురువారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోరతారని తెలిసింది. ఫ్యూచర్ సిటీలో రెండు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వివరాలను సీఎం పార్టీ పెద్దలకు వివరిస్తారని సమాచారం. అలాగే సీఎం ఈ నెల 14న రాం లీలా మైదానంలో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిర్వహించే ర్యాలీలోనూ పాల్గొంటారని తెలియవచ్చింది.