11-12-2025 01:51:44 AM
భీమదేవరపల్లి, డిసెంబర్ 10: (విజయక్రాంతి) తొలి విడత నేడు జరుగనున్న పంచాయతీ ఎన్నికలకు పోలీసు శాఖ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. మండలంలో 20 గ్రామ పంచాయతీల్లో 2 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగతా 18 గ్రామ పంచాయతీలకు గ్రామాలను బట్టి బందోబస్తు చర్యలు పట్టినట్లు ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్త్స్ర అకినపల్లి ప్రవీణ్ కుమార్ లు తెలిపారు.
ఇందుకుగాను ఒక అడిషనల్ అడ్మిన్ డీసీపీ, మొబైల్ రూట్ ఆఫీసర్లుగా 6గురు ఎస్త్స్రలు, స్ట్రైకింగ్ ఫోర్స్ లో ఇద్దరు సీఐలు, 8గురు కానిస్టేబుళ్లను, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌కింద ఒక ఏసీపీ, ఇద్దరు కానిస్టేబుళ్లు, స్టాటిస్టిక్ బందోబస్తు కోసం ఇద్దరు ఎస్త్స్రలు, 20మంది ఏఆర్ ఎస్త్స్ర, ఎస్త్స్ర, హెడ్ కానిస్టేబుళ్లు, 43మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులను నియమించారు. మొత్తంగా ఒక అడ్మిన్ డీసీపీ, ఏసీపీ ఒకరు, ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్త్స్రలు, 20 మంది ఏఎస్త్స్రలు, హెడ్ కానిస్టేబుళ్లు, 83 కానిస్టేబుళ్లు, 19 మంది హోంగార్డులతో కలిపి 114 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులను నిర్వర్తించనున్నారు.
అలాగే సమస్యత్మాక గ్రామాలుగా కేశవాపూర్, దండేపల్లి గ్రామాలను గుర్తించి అదనపు సిబ్బందిని నియమించినట్లు వారు తెలిపారు. - పోలీసు సిబ్బందికి ఎన్నికలపై శిక్షణ ఎల్కతుర్తి మండలానికి ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన పోలీసు సిబ్బంది మండల కేంద్రంలో ఎన్నికల నియమావళి, ప్రవర్తనపై పోలీసు సిబ్బంది కి అడిషనల్ అడ్మిన్ డీసీపీ రవికుమార్, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డిలు హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఓటర్లు తమ ఓటును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేలా చూడాలని, అలాగే అల్లర్లు, గొడవలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పోలీసులు ప్రవర్తించాల్సిన తీరుపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్త్స్ర అకినపల్లి ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.