calender_icon.png 12 December, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ సురభి వాణిదేవి

11-12-2025 01:52:45 AM

వరంగల్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి బుధవారం దర్శించుకున్నారు. వల్లభ గణపతిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు సిద్దేశ్వర శర్మ అమ్మవారి శేష వస్త్రాన్ని, గాజులు కుంకుమ, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త తొనుపునూరి వీరన్న, సిబ్బంది కృష్ణ, సంపత్ పాల్గొన్నారు.