23-05-2025 12:26:38 AM
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవనున్న సీఎం
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం ఢిల్లీలో జర గనున్న నీతి ఆయోగ్ కార్యక్రమానికి రేవంత్ హాజరవనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత అందుబాటులో ఉండే పార్టీ పెద్దలతోనూ సమావేశం కానున్నట్టు సమాచా రం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్, అదనపు నిధుల కోసం పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.