calender_icon.png 24 May, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలన చేతకాక కేసీఆర్‌కు నోటీసులు

23-05-2025 12:26:10 AM

ఒంటెద్దు నరసింహారెడ్డి

హుజూర్ నగర్, మే 22:  తెలంగాణ  కాంగ్రెస్ ప్రభుత్వం కు పాలన చేతకాక  కెసిఆర్ కు నోటీసులు  ఇచ్చిందని బీ ఆర్ ఎస్ హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు.  గురువారం హుజూర్నగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు  ఎంత ఖర్చు అయిందో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి తెలియదు. అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

అసలు కాలేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమిటి ఆ కాలేశ్వరం ప్రాజెక్టులో ఏమేమి ఉన్నాయని కనీసం అవగాహన ప్రస్తుతం ఉన్న తెలంగాణ మంత్రులకి లేదన్నారు. 50 లక్షలుగా ఉన్న పంట పొలాలని కోటి ఎకరాలుగా తీర్చిదిద్దిన మహా గొప్ప ప్రాజెక్టు కాలేశ్వరం అన్నారు. అటువంటి కాలేశ్వరంపై కనీస అవగాహన లేకుండా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడడం విడ్డూరమన్నారు.

ప్రాజెక్టు వ్యయం ఎంతో కూడా తెలియని ఉత్తమ్ లక్ష కోట్లు వృధా అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. కెసిఆర్ కి నోటీసులు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ కు నిదర్శనం అన్నారు. ఆ నోటీసులు వల్ల ఒరిగేది లేదన్నారు. హామీలు అటకెక్కించి అనవసరమైన పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు .

మరో 20 సంవత్సరాలు అయినా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి తో సహా అందరికీ తెలిసిపోయిందని అందుకనే వచ్చినంతవరకు దండుకొని బయటపడతామని ఆలోచనలో ఉన్నారన్నారు.

ఈ  కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కె యల్ యన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.