30-10-2025 05:46:21 PM
మద్యం స్వాధీనం
కోటపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మహారాష్ట్ర శివారు గ్రామాలలో అనధికారికంగా నిర్వహిస్తున్న దాబాలపై పోలీసులు గురు వారం దాడులు నిర్వహించారు. లక్ష్మిపూర్ సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిపై అక్రమంగా ధాబాలు ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్న వారిపై కోటపల్లి ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని దాబా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నెలల తరబడి దాబాలలో మద్యం అమ్ముతుండగా మామూళ్ళు అందకపోవడం వలన ప్రస్తుతం దాడులు జరిగాయని పలువురు చర్చించుకుంటున్నారు.