30-10-2025 04:40:13 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఐకెపి కేంద్రంలో తడిసిన వడ్లను భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, మండలధ్యక్షుడు రేపాక రామచంద్ర రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడవడం జరిగిందని, వాతావరణం రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మ్యాచర్, కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, రైతులకు నష్టం కాకుండా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంధారపు లక్ష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్, నంది నరేష్, పట్టణ అధ్యక్షుడు గంట బాలకృష్ణ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.