30-10-2025 05:42:08 PM
నకిరేకల్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియెజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ మద్దతుగా ఆ ప్రాంత ఎన్నికల ఇంచార్జీగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇందిర నగర్ లోని 94వ బూత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి చెయ్యి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలు కోరారు. వారితో పాటు టీపీసీసీ మెనీఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, నాయకులు గంగుల రాజిరెడ్డి, గోదాసు పృధ్విరాజ్ తదితరులు ఉన్నారు.