30-10-2025 05:40:47 PM
కరీంనగర్ (విజయక్రాంతి): బీసీ కార్పొరేషన్ ను పునరుద్ధరించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ను బీసీ సంక్షేమ శాఖలో విలీనం చేసి కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగులను బీసీ సంక్షేమ శాఖ కూ కేటాయించినారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రత్యేకమైన బీసీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, దానికనుగుణంగా బీసీ కార్పొరేషన్ కు బీసీ సంక్షేమ శాఖలో ఉన్న సిబ్బందికి ప్రమోషన్లు ఇచ్చి కార్పొరేషన్ వర్క్ లకు యధావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చేయాలని కోరారు.