30-10-2025 05:17:53 PM
మల్యాల - పెగడపల్లి ప్రధాన రహదారికి నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు..
మల్యాల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ప్రధాన రహదారి మండలంలోని మల్యాల పెగడపల్లి ప్రధాన రహదారి పనులు చేయకుండా మధ్యలో వదిలేసిన రోడ్లు బురద మాయమై మారాయి. పెద్ద పెద్ద గుంతలు పడి రాకపోకలు సాగించే ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. ఒకటి రెండు వర్షాలకే రహదారులు దెబ్బ తినడంతో రానున్న వర్షాకాలంలో మరమ్మత్తులు చేసి వదిలేసారు. వాహనాలకు సమాధానం జరుగుతున్నాయి. రాత్రి వేళలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రానున్న రోజులలో ఏ విధంగా ఉంటుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేయాలని రహదారులు ఆయా ప్రాంతాదారులు కోరుతున్నారు. జగిత్యాల మల్యాల పెగడపల్లి ప్రధాన రహదారి అధికారులు స్పందించి ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని కోరుచున్నారు.