30-10-2025 05:13:52 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ కాగజ్ నగర్ పోలీస్ డివిజన్ పరిధిలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్స వాలను సత్కరించుకొని పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభం అయి ప్రధాన వీధుల గుండా సాగింది. డీఎస్పీ వహిదుదిన్, సీఐలు ప్రేంకుమార్, కుమారస్వామి, ఎస్ లు , సిబ్బంది పాల్గొన్నారు.