calender_icon.png 30 October, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షానికి రోడ్డు కృంగి భారీ గొయ్యి

30-10-2025 04:41:33 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ నగరంలో మొంథా తుఫానుతో బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన పోచమ్మ మైదాన్, శాంతినగర్ మర్రివెంకటయ్య, కాలనీ, వాసవి కాలనీ, సెకండ్ బ్యాంక్ కాలనీ, పృధ్వి నగర్, ఫస్ట్ బ్యాంక్ కాలనీ, దేశాయిపేట రోడ్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కారణంగా ఇళ్లల్లోకి నీరు వెళ్లి వీధులన్నీ జలమయమై ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అయ్యారు. భారీ వర్షం కారణంగా గురువారం ఉదయం 8 గంటలకు దేశాయిపేట రోడ్, 80 ఫీట్ రోడ్ జంక్షన్ లో రోడ్డు కృంగి భారీ గొయ్యి ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలకు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. కావున అధికారులు అప్రమత్తమై తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.